New Zealand opener Devon Conway had a dream start to his Test career as he joined former India skipper Sourav Ganguly by scoring a hundred on his debut at Lord's.
#SouravGanguly
#DevonConway
#EngVsnz
#LordsTest
అరంగేట్ర టెస్ట్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే(240 బంతుల్లో 16 ఫోర్లతో 136 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట 25 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును కాన్వే అధిగమించాడు.ఓవరాల్‌గా లార్డ్స్ వేదికగా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 6వ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన కాన్వే.. ఈ జాబితాలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన గంగూలీ(131)ని వెనక్కునెట్టాడు.